సొసైటీ – సభ్యులకు వివరణ
తిరుమలాపురం (P.D) రైతుల పరస్పర సహాయక సహకార సొసైటీ – సభ్యులకు వివరణ
1. ఇప్పటి స్థితి
- భూమి కొనుగోలు కోసం చేసిన అప్పుతో సొసైటీ ఇబ్బందిలో ఉంది.
- కోలుకుంటుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం.
- ఆస్తులు, అప్పులు, సభ్యుల వాటాల వివరాలు: సమావేశంలో ఇస్తాం. (ఆస్తులు, అప్పులు, సభ్యుల వాటాలు ఒక వాస్తవ స్థితి పత్రంలో రాయాలి.)
- కంపెనీ పుస్తకాల్లో సొసైటీ అప్పులకు సంబంధం లేదని స్పష్టంగా ఉండాలి.
- బైలాస్, సొసైటీ చట్టం ప్రకారం కోరమ్, ప్రాక్సీ, రద్దుకు అవసరమైన మెజారిటీ చూడాలి.
2. ముందున్న ఎంపికలు
- కొనసాగించడం (కొంత సమయం ఇచ్చి చూడటం).
- భూమి అమ్మకం ద్వారా అప్పు తీర్చడం.
- సొసైటీని రద్దు చేయడం.
నిర్ణయం సర్వసభ్య సమావేశంలో సభ్యులే తీసుకుంటారు.
3. ఓటింగ్ పద్ధతి (ప్రతిపాదన)
పరోక్ష (Online అనగా వెబ్సైట్ లేదా ఆప్ ద్వారా) పద్ధతి
సమావేశానికి 3–7 రోజుల ముందు ఆన్లైన్ ఓటింగ్
స్మార్ట్‌ఫోన్ ఉన్నవారికి ఆన్లైన్ ఓటు ఐచ్ఛికం. ఒకసారి వేస్తే తుది.
ప్రాక్సీ: బైలాస్ అనుమతిస్తేనే.
ప్రాక్సీ ఫారం, సభ్యుని యూజర్ ఐడీ/పాస్‌వర్డ్‌తో మాత్రమే; గడువు లోపు.
online (App) ద్వారా అయితే, బొమ్మల బ్యాలెట్ (✔/✘)
ప్రత్యక్ష (ముఖాముఖీ) పద్ధతి
- సమావేశంలో నేరుగా ఓటింగ్
- ఒకసారి ఓటు వేస్తే తుది; ఆన్లైన్లో వేసినవారు మళ్లీ వేయలేరు.
- ఒక సభ్యునికి ఒక ఓటు (బైలాస్ చెప్పినట్టు).
- వ్రాత పూర్వకంగా అయితే, బొటనవేలి ముద్ర మరియు సాక్షి.
- లెక్కింపు: సభ్యులలో 2–3 మంది కమిటీ; ఫలితం అందరి ముందు చదువుతారు.
4. లెక్కింపు
ఖరీదైన బయటి స్క్రూటినైజర్ బదులు 2–3 మంది సభ్యుల కమిటీ
(కంపెనీలో మూసివేత పనిచేసే CA/CS ధృవీకరణ).
ఫలితం ఓటింగ్ ముగిశాకే బయటపెట్టాలి.
5. సాక్ష్యాల సమితి
తెలుగు, ఇంగ్లీష్ నోటీసు + వివరణ పత్రం
పంపిన రుజువులు
హాజరు పట్టీ
వీడియో రికార్డింగ్
సంతకం చేసిన మినిట్స్
6. వెబ్సైట్ / యాప్
– ఇప్పటికి నేను తయారు చేసినవి: కంపెనీ, సొసైటీ వివరణ పేజీలు (లాగిన్ లేకుండా పబ్లిక్‌గా పెట్టాను.).
– తర్వాత నిర్ణయం: వెబ్సైట్ మాత్రమే / యాప్ మాత్రమే / రెండూ.
– కనీస ఫీచర్లు:
OTP లాగిన్, నోటీసు అందినట్టు లాగ్,
ఓటింగ్ (ముగిసే వరకు ఫలితం దాచడం),
ప్రాక్సీ ఫారం, కాగితం ఓట్ల నమోదు,
మినిట్స్ PDF,
ఆడిట్ లాగ్.
– అయితే, ప్రైవసీ కారణాలను దృష్టిలో ఉంచుకొని, ఆధార్/ బ్యాంకులకు ఇచ్చకీనా ఫోన్ & ఈమెయిల్ వద్దు. మన సబ్యుల్లో ఒక కుటుంబం లోనే 1 కన్నా ఎక్కువ (2 నుండి ఆ పైన) ఉన్నారు కనుక, కుటుంబానికి ఒకరి ఫోన్ నంబర్ చాలు. ఎందరు (ఉదా అందరూ) సభ్యులు లాగిన్ అయినా, కుటుంబంలో ఒకరికే ఓటీపీ వస్తుంది.
ఇది అవగాహన కోసం మాత్రమే. చట్టపరమైన నిర్ధారణ CS/CA చేస్తారు. వివరాలు మారవచ్చు.