v4 company_roadmap Dir only
తిరుమలాపురం (P.D) రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ – మూసివేత: కంపెనీ సభ్యులకు వివరణ
గమనిక:
ఇది a) మన ఛైర్మన్ మరియు ఇతరులు చెప్పటం ద్వారా నాకు తెలియ వచ్చిన కొన్ని వివరాలు మరియు
b) డైరెక్టర్ గా నా లాగిన్ ద్వారా Ministry of Corporate Affairనుండి నేను సేకరించిన్ వివరాలు,
c) కంపనీ వ్యవహారాల గురించి నేను తెలుసుకున్నఅంశాల ఆధారంగా, నేను తయారు చేసిన ముసాయిదా మాత్రమే.
అయితే, ఈ విషయంలో సలహా మరియు చట్టపరమైన నిర్ధారణ CS/CA మాత్రమే చేయాలి.
1. ఇప్పటి స్థితి
- 4-12-2025న తిరుమలాపురం (P.D) రైతు ఉత్పత్తిదారుల(ప్రైవేట్) లిమిటెడ్ కంపెనీగా నమోదైంది.
- అనుమతి పొందిన మూలధనం ₹15,00,000
- చెల్లించిన మూలధనం ₹10,000.
- 10 మంది డైరెక్టర్లు. కంపెనీ సభ్యులు (వాటాదార్లు) కూడా ఆ 10 మందే (MoA/AoA ప్రకారం; ఒక్కొక్కరు ₹1,000).
- డైరెక్టర్లు (ఛైర్మన్ సహా) చెప్పిన ప్రకారం వ్యాపారం మొదలు కాలేదు; బ్యాంక్ ఖాతా, GST లేవు; అప్పులు లేవు.
బ్యాంక్ ఖాతా లేదని చెప్పారు; అయితే చెల్లించిన ₹10,000 ఎక్కడ ఉందో నాకు (VKRaoకు) తెలియదు. అది డీల్ చేసిన వారు చెప్పాలి.
ఈ వివరాలు కూడ నాకు తెలియవు. అవి డీల్ చేసిన వారు చెప్పాలి.
2. బోర్డు నిర్ణయం
- – కొద్ది నెలల కిందట కంపెనీ మూసివేతకు బోర్డులో అంగీకారం కుదిరింది (సంతకం చేసిన మినిట్స్ ఉన్నాయో లేదో నిర్ధారించాలి). సర్వసభ్య సమావేశం ఇంకా జరగలేదు.
3. ఎందుకు మూసివేయాలి
- కంపెనీ ఉన్నంత కాలం ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం ఫారాలు దాఖలు చేయాలి.
- దాఖలు చేయకపోతే కంపెనీకి, డైరెక్టర్లకు జరిమానాలు పడవచ్చు.
- వ్యాపారం లేని కంపెనీకి ఖర్చే తప్ప ప్రయోజనం లేదు.
4. ఎలా జరుగుతుంది
- బోర్డు తీర్మానం: మినిట్స్‌తో నమోదై ఉండాలి (నిర్ధారించాలి).
- సభ్యుల ప్రత్యేక తీర్మానం: సర్వసభ్య సమావేశంలో ఓటింగ్ (మూడొంతుల మంది అనుకూలం కావాలి).
- CA/CS ద్వారా ప్రభుత్వ రిజిస్ట్రార్‌కు దరఖాస్తు. ఒక సంవత్సరం పూర్తయ్యాకే (డిసెంబర్ 2026 తర్వాత) సాధ్యమని అనుకుంటున్నాం.
5. కంపెనీ మూసివేత ఎలా చేయాలి ?
లక్ష్యం: స్వచ్ఛంద స్ట్రైక్ ఆఫ్ (Section 248(2), ఫారం STK-2) ద్వారా ఖర్చు తక్కువగా మూసివేత.- వాస్తవ స్థితి నివేదిక (Statement of Affairs) ఆమోదం, 10 మంది సంతకం.
- మూసివేతకు ఆమోదం; ఇద్దరు డైరెక్టర్లకు అధికారం (CA/CS నియామకం, రిటర్న్స్, ఫారాల సంతకం); ఖర్చుల గరిష్ఠ పరిమితి; సర్వసభ్య సమావేశం ఏర్పాటు.
- (వేసిన ఓట్లలో 75%). రాతపూర్వక సమ్మతి మార్గం కంటే ఇది ఆచరణాత్మకం. (ఇది మనం చట్ట ప్రకారం మార్చి వుంటే ఆ ప్రకారం. కానీ, అలాంటిది జరిగినట్లు లేదు. CA గారి సలహా అడగాలి )
- వివరాలు, డైరెక్టర్ల అఫిడవిట్, ఇండెమ్నిటీ బాండ్‌తో రిజిస్ట్రార్‌కు దరఖాస్తు.
- ఒకవేళ ఎవరైనా డైరెక్టర్ రాజీనామా చేస్తే, కంపెనీకి రాతపూర్వక నోటీసు ఇచ్చి వుండాలి; కంపెనీ అందుకున్న తేదీ నుంచి అమల్లోకి; కంపెనీ 30 రోజుల్లో DIR-12; డైరెక్టర్ తానూ DIR-11 దాఖలు చేయవచ్చు. కానీ మూసివేత పూర్తయ్యే వరకు కనీసం ఇద్దరు డైరెక్టర్లు ఉండాలి; రాజీనామా చేసిన డైరెక్టర్‌కు పదవీకాలంలోని బాధ్యతలు కొనసాగుతాయి. నా రాజీనామా నోటీసు కంపెనీకి అందిన తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. మిగతా బోర్డు దాన్ని గుర్తించి (take note) నమోదు చేయాలి; కంపెనీ DIR-12 దాఖలు చేయాలి. ఈ విషయాన్ని CS నుంచి నిర్ధారించుకుని నాకు తెలియపరచాలి.
- ఒక సంవత్సరం పూర్తయ్యాకే (డిసెంబర్ 2026 తర్వాత) దరఖాస్తు సాధ్యమని నా అంచనా.
- – INC-20A, ADT-1 దాఖలు కాకపోతే జరిమానా ప్రమాదం; CCFS-2026 వర్తింపు.
- – ₹10,000 చందా సొమ్ము ఎక్కడ ఉంది (అది నిర్వహించిన వారు చెప్పాలి)
- – మొదటి ఆర్థిక సంవత్సరం, మొదటి AGM, AOC-4, MGT-7 గడువులు.
- – సభ్యుల రిజిస్టర్, ఎవరికి ఎన్ని షేర్లు.
- – కోరమ్, నోటీసు కాలం (సాధారణంగా 21 రోజులు), వాయిదా నియమాలు, AoA నిబంధనలు.
- సమావేశ నోటీసు వచ్చాక పూర్తిగా చదవండి; సందేహాలు అడగండి.
- సమావేశంలో (లేదా వీడియో కాల్ ద్వారా) మీ ఓటు వేయండి. రాలేకపోతే ప్రాక్సీ ద్వారా.
- కంపెనీ సభ్యులు 10 మందే కాబట్టి సమావేశంలో నేరుగా లేదా వీడియో కాల్ ద్వారా ఓటింగ్ జరుగుతుంది; ప్రత్యేక యాప్ అవసరం లేదు. ఓటు వేశాక మార్చలేరు.
- ప్రాక్సీ: ప్రాక్సీ ఫారంతో మరొకరిని పంపవచ్చు; సభ్యుడు ఆ నిర్ణయానికి కట్టుబడాలి.
6. పద్ధతి
i) బోర్డు సమావేశం
ii) బోర్డు తీర్మానాలు:
iii) సర్వసభ్య సమావేశంలో ప్రత్యేక తీర్మానం
iv) CA ధృవీకరించిన
v) డైరెక్టర్ల రాజీనామా
vi) సమయం
vii) CS/CA తో నిర్ధారించవలసినవి:
కంపనీ మరియు సొసైటీ విషయంలో గమనించవలసినవి
A) కంపెనీ సభ్యులు (10 మంది) చేయవలసినది
B) ఓటింగ్ పద్ధతి (ప్రతిపాదన)
గమనిక: ఇది సభ్యుల అవగాహన కోసం మాత్రమే నేను (వెల్ముల కృష్ణారావు) తయారు చేసినది.
దీనితో, లేదా ఇందులోని అభిప్రాయాలతో ఇతర గౌరవ డైరెక్టర్లు, గౌరవ సభ్యులకు ఏ ప్రమేయం లేదు.
కావున, ఇవి నా సొంత అభిప్రాయాలుగా మాత్రమే పరిగణించండి.
చట్టపరమైన నిర్ధారణ CS/CA చేస్తారు. వివరాలు మారవచ్చు.