society v2

సొసైటీ – సభ్యులకు వివరణ

తిరుమలాపురం (P.D) రైతుల పరస్పర సహాయక సహకార సొసైటీ – సభ్యులకు వివరణ

1. ఇప్పటి స్థితి

  • భూమి కొనుగోలు కోసం చేసిన అప్పుతో సొసైటీ ఇబ్బందిలో ఉంది.
  • కోలుకుంటుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం.
  • ఆస్తులు, అప్పులు, సభ్యుల వాటాల వివరాలు: సమావేశంలో ఇస్తాం. (ఆస్తులు, అప్పులు, సభ్యుల వాటాలు ఒక వాస్తవ స్థితి పత్రంలో రాయాలి.)
  • కంపెనీ పుస్తకాల్లో సొసైటీ అప్పులకు సంబంధం లేదని స్పష్టంగా ఉండాలి.
  • బైలాస్, సొసైటీ చట్టం ప్రకారం కోరమ్, ప్రాక్సీ, రద్దుకు అవసరమైన మెజారిటీ చూడాలి.

2. ముందున్న ఎంపికలు

  • కొనసాగించడం (కొంత సమయం ఇచ్చి చూడటం).
  • భూమి అమ్మకం ద్వారా అప్పు తీర్చడం.
  • సొసైటీని రద్దు చేయడం.

నిర్ణయం సర్వసభ్య సమావేశంలో సభ్యులే తీసుకుంటారు.

3. ఓటింగ్ పద్ధతి (ప్రతిపాదన)

పరోక్ష (Online అనగా వెబ్సైట్ లేదా ఆప్ ద్వారా) పద్ధతి

  • సమావేశానికి 3–7 రోజుల ముందు ఆన్‌లైన్ ఓటింగ్
  • స్మార్ట్‌ఫోన్ ఉన్నవారికి ఆన్‌లైన్ ఓటు ఐచ్ఛికం. ఒకసారి వేస్తే తుది.
  • ప్రాక్సీ: బైలాస్ అనుమతిస్తేనే.
  • ప్రాక్సీ ఫారం, సభ్యుని యూజర్ ఐడీ/పాస్‌వర్డ్‌తో మాత్రమే; గడువు లోపు.
  • online (App) ద్వారా అయితే, బొమ్మల బ్యాలెట్ (✔/✘)
  • ప్రత్యక్ష (ముఖాముఖీ) పద్ధతి

    • సమావేశంలో నేరుగా ఓటింగ్
    • ఒకసారి ఓటు వేస్తే తుది; ఆన్‌లైన్‌లో వేసినవారు మళ్లీ వేయలేరు.
    • ఒక సభ్యునికి ఒక ఓటు (బైలాస్ చెప్పినట్టు).
    • వ్రాత పూర్వకంగా అయితే, బొటనవేలి ముద్ర మరియు సాక్షి.
    • లెక్కింపు: సభ్యులలో 2–3 మంది కమిటీ; ఫలితం అందరి ముందు చదువుతారు.

    4. లెక్కింపు

  • ఖరీదైన బయటి స్క్రూటినైజర్ బదులు 2–3 మంది సభ్యుల కమిటీ
  • (కంపెనీలో మూసివేత పనిచేసే CA/CS ధృవీకరణ).
  • ఫలితం ఓటింగ్ ముగిశాకే బయటపెట్టాలి.
  • 5. సాక్ష్యాల సమితి

  • తెలుగు, ఇంగ్లీష్ నోటీసు + వివరణ పత్రం
  • పంపిన రుజువులు
  • హాజరు పట్టీ
  • వీడియో రికార్డింగ్
  • సంతకం చేసిన మినిట్స్
  • 6. వెబ్‌సైట్ / యాప్

  • – ఇప్పటికి నేను తయారు చేసినవి: కంపెనీ, సొసైటీ వివరణ పేజీలు (లాగిన్ లేకుండా పబ్లిక్‌గా పెట్టాను.).
  • – తర్వాత నిర్ణయం: వెబ్‌సైట్ మాత్రమే / యాప్ మాత్రమే / రెండూ.
  • – కనీస ఫీచర్లు:

  • OTP లాగిన్, నోటీసు అందినట్టు లాగ్,
  • ఓటింగ్ (ముగిసే వరకు ఫలితం దాచడం),
  • ప్రాక్సీ ఫారం, కాగితం ఓట్ల నమోదు,
  • మినిట్స్ PDF,
  • ఆడిట్ లాగ్.
  • – అయితే, ప్రైవసీ కారణాలను దృష్టిలో ఉంచుకొని, ఆధార్/ బ్యాంకులకు ఇచ్చకీనా ఫోన్ & ఈమెయిల్ వద్దు. మన సబ్యుల్లో ఒక కుటుంబం లోనే 1 కన్నా ఎక్కువ (2 నుండి ఆ పైన) ఉన్నారు కనుక, కుటుంబానికి ఒకరి ఫోన్ నంబర్ చాలు. ఎందరు (ఉదా అందరూ) సభ్యులు లాగిన్ అయినా, కుటుంబంలో ఒకరికే ఓటీపీ వస్తుంది.
  • 7. ప్రతిపాదిత కాలపట్టిక (Action plan)

    పని పట్టిక (Schedule Table)

    ప్రాజెక్ట్ టైమ్‌లైన్ పట్టిక

    సమయం పని
    అక్టోబర్ 2026 AoA, MoA, సభ్యుల రిజిస్టర్, సొసైటీ బైలాస్ సేకరణ; CS/CA తో చర్చ
    నవంబర్ 2026 బోర్డు సమావేశం; నివేదిక, తీర్మానాలు; పేజీలు, వాయిస్ నోట్ పంపిణీ
    డిసెంబర్ 2026 నోటీసు పంపడం; సర్వసభ్య సమావేశం (డిసెంబర్ 4 తర్వాత)
    జనవరి–ఫిబ్రవరి 2027 STK-2 దాఖలు; సొసైటీపై వాస్తవ స్థితి పత్రం, నిర్ణయం

    8. బాధ్యతలు

  • డైరెక్టర్లు: సంతకాలు, సభ్యులకు వివరణ.
  • CA/CS:ఫారాలు, ధృవీకరణ, చట్టపరమైన సమీక్ష.
  • లెక్కింపు కమిటీ: ఓట్ల లెక్క.
  • 9.సభ్యులు చేయవలసినది

    • సభకు రండి, ప్రశ్నలు అడగండి, మీ అభిప్రాయం చెప్పండి.

    10.గమనికలు

    ఇది అవగాహన కోసం మాత్రమే. చట్టపరమైన నిర్ధారణ CS/CA చేస్తారు. వివరాలు మారవచ్చు.

  • ఒకవేళ, సొసైటీని కొనసాగించదలచుకొంటే, అన్నీ చట్ట ప్రకారంగా, అందరికీ సంతృప్తికరంగా నడుపగలిగితే, సొసైటీ కొరకు ఒక website / ఆప్ కావాలనుకుంటే సర్వసభ్య సమావేశంలో తీర్మానించి, వెల్ముల కృష్ణారావు గారిని వ్రాత పూర్వకంగా అభ్యర్థించాలి. నా సబ్ డొమైన్ పేరుతో నేను సొసైటీ కొరకు ఉచితంగా తయారు చేసి ఇస్తాను. పేజీలు, యాప్/వెబ్‌సైట్ తయారీ, సమన్వయం నా నిర్వహణలో ఉంటుంది.
  • అయితే, సొసైటీయే నిర్వహించదలచుకొంటే, సొసైటీ పేరు మీద ఒక డొమైన్ కొనాలి. కానీ, అ ఖర్చు సొసైటీ భరించడం కష్టం. అది నేను prefer చేయను.