E 2.FPC-చట్టపరమైన మార్గదర్శకాలు

FPC Legal Guidelines

ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ (FPC) – చట్టపరమైన మార్గదర్శకాలు

కంపెనీల చట్టం, 2013 ప్రకారం డైరెక్టర్లు మరియు వాటాదారుల బాధ్యతలు

గమనిక: ఇది అవగాహన కోసం మాత్రమే. ఖచ్చితమైన చట్టపరమైన సలహా కోసం నిపుణులను సంప్రదించండి.

1. మొదటి సంవత్సరం పాటించవలసిన నియమాలు (First Year Calendar)

సమయం చేయవలసిన పని చట్టపరమైన నిబంధన
రిజిస్ట్రేషన్ అయిన 30 రోజుల్లోపు మొదటి బోర్డు సమావేశం (First Board Meeting) నిర్వహించాలి. Section 173(1)
రిజిస్ట్రేషన్ అయిన 30 రోజుల్లోపు కంపెనీకి ఫస్ట్ ఆడిటర్ (Statutory Auditor)ను నియమించాలి. Section 139(6)
180 రోజుల్లోపు వ్యాపార ప్రారంభ ధృవీకరణ పత్రం (Commencement of Business – INC 20A) దాఖలు చేయాలి. Section 10A

2. ప్రతి సంవత్సరం పాటించవలసిన నియమాలు (Annual Calendar)

గడువు అంశం వివరణ
ప్రతి 3 నెలలకు ఒకసారి బోర్డు సమావేశం ఏడాదికి కనీసం 4 సమావేశాలు జరగాలి. రెండు మీటింగ్ల మధ్య 120 రోజులకు మించకూడదు.
సెప్టెంబర్ 30 లోపు వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) సభ్యులందరితో సమావేశం నిర్వహించి ఆడిట్ రిపోర్ట్ ఆమోదించాలి. (నోటీసు 14 రోజుల ముందు ఇవ్వాలి).
సెప్టెంబర్ 30 లోపు డైరెక్టర్ల KYC (DIR-3 KYC) ప్రతి డైరెక్టర్ తమ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలి.
అక్టోబర్ 30 లోపు ఆర్థిక నివేదికలు (AOC-4) లాభనష్టాల పట్టిక, బ్యాలెన్స్ షీట్ ROC కి సమర్పించాలి. (CA సంతకం తప్పనిసరి).
నవంబర్ 29 లోపు వార్షిక రిటర్న్స్ (MGT-7A) కంపెనీ వాటాదారులు, డైరెక్టర్ల మార్పుల వివరాలు సమర్పించాలి.

శిక్షలు మరియు జరిమానాలు (Penalties for Non-Compliance)

నిబంధనలు పాటించకపోతే కలిగే పరిణామాలు:

  • ఆలస్య రుసుము: ఫారమ్‌లు ఆలస్యంగా దాఖలు చేస్తే రోజుకు రూ. 100 చొప్పున అదనపు పెనాల్టీ పడుతుంది.
  • డైరెక్టర్ల అనర్హత: వరుసగా 3 ఏళ్లు రిటర్న్స్ దాఖలు చేయకపోతే డైరెక్టర్లు 5 ఏళ్ల వరకు ఏ కంపెనీలోనూ ఉండకుండా అనర్హుడవుతారు (Section 164).
  • కంపెనీ మూసివేత: నిబంధనలు పాటించని కంపెనీని ROC రద్దు చేసే అవకాశం ఉంది.
  • జైలు శిక్ష/జరిమానా: మోసపూరిత చర్యలు జరిగితే కంపెనీ చట్టం సెక్షన్ 447 ప్రకారం భారీ జరిమానా లేదా జైలు శిక్ష ఉండవచ్చు.

నిర్వహించవలసిన రిజిస్టర్లు (Statutory Registers)

  • సభ్యుల రిజిస్టర్ (Register of Members – MGT-1)
  • డైరెక్టర్ల రిజిస్టర్ (Register of Directors)
  • మినిట్స్ బుక్ (Minutes of Meetings) – బోర్డు మరియు AGM సమావేశాల వివరాలు.
  • షేర్ సర్టిఫికేట్ బుక్ (Share Certificates)

ఆడిట్ మరియు డివిడెండ్ (Audit & Dividend)

ఆడిట్: ప్రతి సంవత్సరం కంపెనీ లావాదేవీలను చార్టర్డ్ అకౌంటెంట్ (CA) తో ఆడిట్ చేయించి, ఆ రిపోర్టును సభ్యుల ముందు ఉంచాలి.

డివిడెండ్: కంపెనీకి లాభాలు వచ్చినప్పుడు, డైరెక్టర్ల సిఫార్సు మేరకు సభ్యులకు లాభాల్లో వాటా (Dividend) పంచవచ్చు. ఇది కేవలం నగదు రూపంలోనే కాకుండా బోనస్ షేర్ల రూపంలో కూడా ఉండవచ్చు.

డైరెక్టర్ల మరియు వాటాదారుల బాధ్యతలు

డైరెక్టర్ల బాధ్యత: కంపెనీ ఆస్తులను కాపాడటం, పారదర్శకమైన నిర్ణయాలు తీసుకోవడం మరియు గ్రామ రైతుల ప్రయోజనం కోసం పనిచేయడం.

వాటాదారుల (Shareholders) హక్కులు: కంపెనీ లాభాల్లో వాటా పొందే హక్కు, AGMలో పాల్గొని ఓటు వేసే హక్కు మరియు కంపెనీ లెక్కలను ప్రశ్నించే హక్కు కలిగి ఉంటారు.

Companies Act, 2013 – Key References

  • Section 96: AGM
  • Section 101: Notice of meeting
  • Section 102: Explanatory statement
  • Section 105: Proxies
  • Sections 106–108: Voting rights / poll / e-voting
  • Section 110: Postal ballot
  • Section 129: Financial statements
  • Section 134: Board’s report
  • Section 139(6): First auditor
  • Section 149 & 152: Directors
  • Section 166: Duties of directors
  • Section 173: Board meetings
  • Section 174: Quorum
  • Section 184: Disclosure of interest
  • Section 185: Loans to directors
  • Section 188: Related party transactions
  • Section 164: Disqualification of directors
  • Section 447: Punishment for fraud
error: Content is protected !!